NTV Telugu Site icon

MLC Jeevan Reddy: అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..

Jeevan Reddy

Jeevan Reddy

MLC Jeevan Reddy: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నమ్మ్ముకున్న నా కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఇంత అగౌరవం.. అవమానకరంగా భావిస్తున్న అన్నారు. గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేఖ రాసినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. నేను మానసిక వేదనలో ఉన్నాను.. తీవ్ర మానసిక వేదనతో లేఖ రాస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువను పాటించాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు. సంఖ్యాబలంతో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చారు. అయినా కూడా తాము పార్టీ ఫిరాయింపులేనని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేక మానసిక ఆవేదనలో ఉన్న అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏ లకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరయింపులకి ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
పోచారం ఇంట్లో మీటింగ్ పెట్టీ… ఫిరాయింపు దారులదే పూర్తి బాధ్యత అంటూ తీర్మానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు..

పోచారం అధ్యక్షతన ఫిరాయింపు దారులతో సీఎం.. ఇన్చార్జి సమావేశం అవ్వడం… పార్టీలో…ప్రభుత్వంలో వారికే బాధ్యతలు ఇవ్వడం సరికాదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పని చేసిన తాను.. ఇటీవల పార్టీలో చేరిన జగిత్యాల ఎంఎల్ఏ నా అనుచరున్ని కిరాతకంగా చంపించారని భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ ఉన్నా.. ఫిరాయింపుల చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆలోచనలు భిన్నంగా .. కేసీఆర్ అనుసరించినట్టే మనం కూడా ఫిరాయింపులు అని మండిపడ్డారు. తాను నమ్మ్ముకున్న నా కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఇంత అగౌరవం.. అవమానకరంగా భావిస్తున్న అన్నారు. నా భవిష్యత్ కార్యాచరణ పై మీరే మార్గదర్శకం చేయండని తెలిపారు. పార్టీ ఫిరయింపుల కి ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని ఆరోపించారు. పోచారం ఇంట్లో మీటింగ్ పెట్టి.. ఫిరాయింపు దారులే పూర్తి బాధ్యత అంటూ తీర్మానం చేశారన్నారు. రాహుల్ గాంధీ ఏం చెప్పారు.. మనం ఏం చేస్తున్నాం? అని ప్రశ్నించారు. తన అనుచరుణ్ణి చంపిన వ్యక్తి కాంగ్రెస్ వ్యతిరేకి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ నేతలపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ మారి.. కాంగ్రెస్ ముసుగు వేసుకుంటే ఎట్లా..? అని మండిపడ్డారు.

Bandi Sanjay: మూసీ పేరుతో భారీ అవినీతి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్..

Show comments