NTV Telugu Site icon

Ravindra Bharathi: సీతారాం ఏచూరి సంస్మరణ సభ.. ఒకే వేదికపై సీఎం రేవంత్‌, కేటీఆర్..

Ktr Revanth Reddy

Ktr Revanth Reddy

Ravindra Bharathi: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్మిక ఉపాధి శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభరం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించారు.

ఇటీవల సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపిస్తారనే వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిలో ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారా?… లేక సీతారాం ఏచూరి సంస్మరణ సభ వారిద్దరినీ కలిపే వేదిక అవుతుందా? రాజకీయ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడతారా?… లేదంటే ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంటుందా? అనే దానిపై గుసగుసలు వినపిస్తున్నాయి. సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఆ అంశానికే పరిమితమయ్యేలా తమ్మినేని వీరభరం చొరవ తీసుకుంటారా? అనే దానిపై ఉత్కంఠంగా మారింది.
Tirumala Laddu controversy: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..