NTV Telugu Site icon

Diwali Celebrations: దీపావళి వేడుకల్లో అపశృతులు.. 48 మందికి గాయాలు.. 9 మందికి సీరియస్

Diwali

Diwali

Diwali Celebrations: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. యువకులు, వృద్ధులు పటాకులు పేల్చుతూ ఆనందంగా గడిపారు. టపాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నా అవి పాటించకుండా చివరకు పండుగ పూట ఆసుపత్రి బాట పట్టారు బాధితులు. నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోచోట పటాకులు కాల్చి పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందులో 9 మందికి సీరియస్‌గా వున్నట్లు వైద్యులు తెలిపారు. వారందరికి ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా 34 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

సరోజినీ ఐ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ.. దీపావళి బాణసంచా కాలుస్తూ 50 మంది గాయపడి సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని తెలిపారు. ఇందులో 9మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. 9 మందికి శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు. 9 మంది ని అబ్జర్వేషన్ లో పెట్టాము వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తామన్నారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ఒపి ద్వారా మొత్తం 5 0మంది చికిత్స కోసం గాయపడ్డారు వచ్చారని క్లారిటీ ఇచ్చారు. 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని, గాయపడ్డవారిలో 35 మంది చిన్నారులు ఉన్నారు 15మంది పెద్దలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సరోజిని కంటి ఆస్పత్రికి గాయపడ్డవారు చికిత్స కోసం వచ్చారన్నరు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్షతగాత్రుల సంఖ్య తగ్గిందన్నారు. చాలావరకు అవేర్నెస్ రావడం వల్లే మేజర్ గా గాయపడ్డ వారు ఎవరు లేరన్నారు. గత సంవత్సరం 72 మంది చికిత్స కోసం వచ్చారని, కానీ ఈ సారి 50 మంది చికిత్స కోసం వచ్చారు ఇందులో సీరియస్ కేసులు లేవని స్పష్టం చేశారు.
Astrology: నవంబర్ 1, శుక్రవారం దినఫలాలు