Site icon NTV Telugu

Rahul Gandhi: ఇప్పుడంతా మోడ్రన్‌ రాజకీయమే.. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌ సమ్మిట్-2025కు నిన్ననే రావాల్సి ఉండే.. కానీ, కాశ్మీర్ కి వెళ్లాను.. క్షమించండి.. ఈ సమ్మిట్‌ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇక, రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలి.. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయి.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు అని ఆయన తెలిపారు. ఇక, భారత్‌ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచా.. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Read Also: Chiru Anil: అబ్బే.. ఆ వార్తలు అన్నీ ఫేకేనట?

కానీ, ఈ పాదయాత్రలో నేను ప్రజలపై నా ప్రేమను వ్యక్త పరచగలిగాను అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపరిచానో అప్పట్నుంచి అందరూ స్పందిస్తున్నారని తెలిపారు. యాత్రలో కొన్ని సార్లు స్టక్ అయ్యాను.. అప్పటి నుంచి నన్ను చాలా మంది ఇష్టపడటం మొదలు పెట్టారు.. ఓ చిన్న అమ్మాయి వచ్చి లవ్ యూ అని చెప్పింది.. ఆ తర్వాత నేను కూడా నా ఇష్టాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తూ వచ్చాను అన్నారు. హిందీలో ఓ స్లోగన్ తీసుకున్నాం.. విద్వేషం అనే బజార్ లో ప్రేమ అనే దుకాణం తెరిచా (నఫ్రత్ కే బజార్ మే.. మే.. మహబత్ కే దుకాన్) అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Exit mobile version