Afzalgunj firing: హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు వాడిన టూ వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా గాంధీ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని హస్తగతం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో టూ వీలర్ చోరీ చేసిన దుండగులు.. ఆ వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడి చేసినట్లు గుర్తించారు. తిరిగి టూ వీలర్‌పైనే హైదరాబాద్ చేరుకున్న దుండగులు.. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయపూర్ వెళ్లేందుకు యత్నించారు. ఇక, రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో హైదరాబాద్‌లో కాల్పులు జరిపారు. హైదరాబాద్ నుంచి తప్పించుకొని బీదర్‌కు దుండగులు పారిపోయారు.
Read Also: Janhvi Kapoor: పెళ్లి చేసుకుని.. ముగ్గురు పిల్లలతో సెటిల్ అవ్వాలని ఉంది : జాన్వీ కపూర్
అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులు ఎక్కడెక్కడకు వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. పలు ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా వారి కదలికలను గమనిస్తున్నారు. తిరుమలగిరి నుంచి షామీర్‌పేట్ వరకు ఆటోలో వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు సమాచారం అందుకున్నారు. ఇక, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్న హైదరాబాద్, బీదర్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.