Hyderabad Fog: కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్.. శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..
- కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్..
- శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fog: హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇవాళ ( జనవరి 2న) ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్మేశాయి. తెల్లవారుజాము నుంచి కనిపించిన ఈ పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కాశ్మీర్ లోయను తలపించేలా కనిపించాయి. రోడ్లు, చెట్లు, భవనాలు పొగమంచు తెర వెనక కనుమరుగు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవే తో పాటు శామీర్‌పేట్, మేడ్చల్, తూముకుంట, షామ్షాబాద్, ఆదిబట్ల, గండిపేట, మోకిల, కొంపల్లి, సంగారెడ్డి, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, కిస్మత్ పూర, పటాన్ చెరు, ఆర్సీపుర్, వికారాబాద్ వైపు వెళ్లే శివారు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల వరకు దృశ్యమానత (విజిబిలిటీ) బాగా తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
- CM Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
అయితే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేతో పాటు పలు ప్రధాన రహదారుల వాహనదారులు ఉదయం 8 గంటలు అయినా పొగ మంచుతో 10 అడుగుల దూరం ఉన్న వాహనాల రాకపోకలు కనిపించకపోవడంతో.. లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాయి. ఇక, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం డిపో సేఫ్టీ అధికారి వెంకటేశం సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తున అటవీ ప్రాంతం ఉండడంతో రోజువారీ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటుంది.
Read Also: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
అలాగే, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, కిస్మత్ పూర్, ఔటర్ రింగు రోడ్డుతో పాటు వికారాబాద్ వైపు జాతీయ రహదారి మొత్తాన్ని పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచుతో తీవ్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళుతున్న వాహనాలు కనిపించక పోవడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఫాగ్ లైట్స్ వేసినప్పటికి రహదారి కనిపించడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అహ్లాదకరమైన వాతావారణాన్ని మార్నింగ్ వాకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రద్దు అయింది. అలాగే, శంషాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానం అలస్యంగా నడుస్తుంది. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోని ముంబై జాతీయ రహదారి ఆర్సీపురం నుంచి పటాన్ చెర్వు మీదుగా ఇస్నాపూర్, రుద్రారం, ముత్తంగి, ఇంద్రేశం వరకు పొగ మంచు కమ్మేసింది. ఈ పొగ మంచు వల్ల విద్యార్థులు, ఉద్యోగస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
తాజావార్తలు
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్‌ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్‌తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!