NTV Telugu Site icon

Crime: భార్యను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త..

Hyd

Hyd

Crime: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో భార్య పద్మ మీద అనుమానంతో భర్త నరేంద్ర హత్య చేశాడు. అయితే, పద్మ- నరేంద్ర దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అమ్మాయి యూఎస్ లో ఉంటుంది.. ఇక, అబ్బాయి త్రిబుల్ ఐటీ ఢిల్లీలో ఉన్నాడు.. ఇంట్లో ఇద్దరు ఉండడంతో తరచూ భార్య మీద అనుమానంతో గొడవలు జరిగేవి.. నిన్న రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భార్యను గొంతు నిలిమి చంపేశాడు భర్త నరేంద్ర.

Read Also: AP Assembly Session: భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లుకు ఆమోదం

ఇక, భార్య పద్మ చనిపోయిందని గుర్తించాక బోరబండ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన భర్త నరేంద్ర లొంగిపోయాడు. కాగా, ఈ ఘటనపై బోరాబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.