Site icon NTV Telugu

Bar License Applications: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్లకు భారీగా దరఖాస్తులు..

Bar

Bar

Bar License Applications: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు భారీ ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్‌ కోసం 3,668 అప్లికేషన్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు బార్లకు 148 అప్లికేషన్లు వచ్చాయి. అయితే, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ పరిధిలోని జల్‌పల్లి మున్సిపాలిటీలోని ఒక్క బార్‌కు 57 దరఖాస్తులు, మహబూబ్‌నగర్‌లోని బార్‌కు 49, నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని బార్‌కు 15 అప్లికేషన్లు వచ్చాయి.

Read Also: Kannappa: హరిహర వీరమల్లుపై వివాదం చేసిన వాళ్ళు కన్నప్పపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారు?

అయితే, ఈ మొత్తం అప్లికేషన్ల ద్వారా ఎక్సైజ్‌ శాఖకు సుమారు రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ డ్రా ద్వారా బార్ల యజమానులను సెలక్ట్ చేస్తారు. జిల్లాల్లోని బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన డ్రా పద్ధతి ద్వారా బార్‌ హోల్డర్‌ ఎంపిక కొనసాగుతుందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌ వెల్లడించారు. డ్రా పద్దతిని ఎక్కడెక్కడ అనే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Exit mobile version