NTV Telugu Site icon

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ

Heavyrainhyderabad

Heavyrainhyderabad

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆయా చోట్ల సాయంత్రం 4గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాకుండా సాయంత్రం సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లింగంపల్లి, తెల్లాపూర్, మియాపూర్‌, చందానగర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌ నగర్‌, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, జగద్గిరిగుట్ట, షాపూర్‌, జీడిమెట్ల, బాలనగర్‌, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, షాద్‌నగర్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, నాంపల్లి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, నారాయణ గూడు, చిక్కడపల్లి,
సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట్‌, చిలకలగూడ, మారేడుపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్‌, బాచుపల్లి, మేడ్చల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్‌, దుండిగల్‌, గండిమైసమ్మ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రావొద్దని అధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సాయం కోసం 040 21111111కు ఫోన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. చాలా చోట్ల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.