NTV Telugu Site icon

Hyderabad Rain Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. 2 గంటల్లో అతి భారీ వర్షసూచన

Hyderabadheavyrainalert

Hyderabadheavyrainalert

హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది. నగర వాసులెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేసింది.

ఇది కూడా చదవండి: 20 Trains Cancelled: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విజయవాడ నుంచి వెళ్లే 20 రైళ్లు రద్దు..

ఇదిలా ఉంటే శనివారం ఉదయం నుంచి కూడా నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాతావరణ శాఖ అలర్ట్‌తో జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లపై నీరు నిలవకుండా క్లియర్ చేస్తున్నరు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరారు. శనివారం కావడం వల్ల సాఫ్ట్‌వేర్, ఇతర కొన్ని ఉద్యోగులకు వీకాఫ్ కావడంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో కొంత ట్రాఫిక్‌కు తక్కువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Asna Cyclone: దూసుకొస్తున్న అస్నా తుఫాను.. గుజరాత్‌కు ఐఎండీ హెచ్చరికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారడంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్‌ డీసీల్లో పర్యటన..