Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు.. ఇంటి ముందు బ్యారికేడ్లు..
- మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు..
- కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు..
- హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు..
- ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ,మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావుని కలవనిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి మీకు అనుమతి ఇవ్వాలని, మీకెందుకు అభ్యంతరం అని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
Read also: Telangana DGP: ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతలపై రాజీ పడద్దు.. డీజీపీ ఆదేశం
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే గాంధీ ఇంటికి వెళుతున్న పలు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లకుండా ఇంటి ముందు పోలీసుల పహారా కాస్తున్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. బోయినపల్లి లో ఆయన నివాసంలో ఇంట్లోనే పోలీసులు ఉంచారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్ చేశారు. అయితే గాంధీ ఇంటికి వెళుతున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎంఎల్ఏ ఇంటికి పోతే తప్పు ఏంటి..? అని ప్రశ్నించారు. దానం నీ అనుమతించి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.
Read also: Sitaram Yechury : సీతారాం ఏచూరి తర్వాత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎవరంటే?
అయితే ఈనేపథ్యంలో హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ నేతల అక్రమ అరెస్టులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ ర్యాంకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గాంధీని, వారి అనుచరులను, ఎమ్మెల్యేపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 13, 2024
Voter ID: క్యూఆర్ కోడ్‌తో ఓటరు దరఖాస్తులు..ఎన్నికల సంఘం మరో సదుపాయం
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!