NTV Telugu Site icon

Harish Rao: మూసీ ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి..

Harish Rao

Harish Rao

Harish Rao: మూసీ ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు. హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. అనవసరంగా మూసి సుందరీకరణ అంటున్నారు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యా నించారు. కాంగ్రెసు పార్టీ అంటే ఆపన్న హస్తం అంటారు…కానీ ఇది భస్మాసుర హస్తం గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మార్చుకొని… బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి అన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ లో ఉందని గుర్తు చేశారు. ముందు నీ ఇల్లు, నీ సోదరుని ఇల్లు కూల్చుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదొస్తే ఫోన్ చేయండి.. అర్ధగంటలో మీ ముందుంటా అన్నారు. బుల్‌డోజర్లు వచ్చినా.. జేసీబీలు వచ్చినా.. ముందు మమ్మల్ని దాటి రావాలన్నారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి ఇళ్లు సర్వే నెంబర్ 30 రెడ్డికుంటలో ఉంది.. కుంటలో ఉన్న ని ఇళ్లు ముందు కూలగొట్టు రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిసినోళ్ల దగ్గరుండి కట్టిస్తున్నావ్.. పేదల ఇండ్లకు మాత్రం కూలగొడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవిత కాలం ఐదేండ్లు మాత్రమే.. కానీ నువ్వు కూల గొట్టే పేదల ఇండ్లు జీవిత కాలం కళ అన్నారు. మీకు ఇబ్బంది వస్తే.. తెలంగాణ భవన్‌కు రండి.. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయ్ అన్నారు. అర్ధరాత్రి వచ్చినా.. మీకు ఆశ్రయమిస్తామని హరీష్ రావు అన్నారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీలోకి మురికి నీరు రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ భవన్‌కు ప్రజలు పూర్తిగా గోడు చెప్పడానికే వచ్చారని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం బాధితుల వద్దకు వెళ్తున్నామన్నారు.

Siddipet Crime: మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు..

Show comments