Site icon NTV Telugu

Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి..

Harish Rao

Harish Rao

Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని తెలిపారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీ కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ వెంటే ఉంటారని భరోసా ఇచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామన్నారు. బాధితులకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు.

కేసీఆర్ హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చివేసి మూసీపై పెద్ద భవనాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేసే అంశంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు పట్టించుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రతిష్టను సీఎం రేవంత్ దెబ్బతీస్తున్నారన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాకే మూసీపై ముందస్తుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కూక‌ట‌ప‌ల్లిలో హైడ్రా బాధితుడు బుచ్చ‌మ్మ‌డిది ఆత్మ‌హ‌త్య కాదు, రేవంత్‌రెడ్డిది హ‌త్య. ఇల్లు కట్టుకుని ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బాధతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.


Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు..

Exit mobile version