Ghatkesar News: ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా..
- బర్త్‌డే పార్టీకి వెళ్లి విగతజీవిగా
- రిటైర్డ్ ఎస్సై కుమారుడి మృతిపై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghatkesar News: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ రిటైర్డ్ ఎస్సై కుమారుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏదులాబాద్ లివిన్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 24వ తేదీ రాత్రి స్నేహితుడు ఘన్కోట్ రిషబ్‌తో కలిసి ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి వెళ్లాడు.
మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో రిషబ్ తండ్రి, ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి కృష్ణ కౌండిన్య ఫామ్‌హౌస్‌లో స్పృహతప్పి పడిపోయాడని సమాచారం అందించారు. వెంటనే అతడిని ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి ధ్రువీకరించారు. సరదాగా వేడుకలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడం, మృతికి గల పరిస్థితులపై తీవ్ర అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి తండ్రి ప్రవీణ్ కుమార్ ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
తండ్రి ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, పార్టీలో ఏం జరిగింది? మృతికి గల అసలు కారణాలు ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఫామ్‌హౌస్ నిర్వాహకులతో పాటు వేడుకలకు హాజరైన ఇతర స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Ghatkesar News: ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా..
-
Supreme Court: గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత వివాదం.. సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు
-
Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
-
Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్!
-
Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!