Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Part 1 Advance Booking: రణ్‌బీర్ కపూర్, యశ్ కాంబినేషన్లో వస్తున్న మైథాలాజికల్ ఎపిక్ ‘రామాయణ: పార్ట్ 1’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ. 20.50 కోట్ల మేర ముందస్తు టికెట్ల అమ్మకాలు జరగడం సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తోంది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటివరకు దాదాపు 2.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. నవంబర్ 4న జరిగే ప్రీమియర్ షోలతో పాటు, నవంబర్ 5న మొదటి రోజు రిలీజ్ బుకింగ్స్ అన్నీ కలిపి ప్రీ-సేల్స్‌లోనే సినిమా ఏకంగా $2 మిలియన్ల మార్కును (సుమారు రూ. 20.50 కోట్లు) దాటేసి సరికొత్త రికార్డులకు నాంది పలికింది.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. నార్త్ అమెరికాలో నవంబర్ 4న ప్రదర్శించే ప్రివ్యూ షోల కోసం సినీప్రియులు పోటీపడుతున్నారు. పెద్ద భారతీయ సినిమాలకు విడుదలకు ముందే ప్రదర్శించే ప్రివ్యూ షోలు ఏ స్థాయిలో హెల్ప్ అవుతాయో మరోసారి రుజువైంది. ఇప్పటివరకు ఇండియా నుంచే అత్యధిక వసూళ్లు రాగా, నార్త్ అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన బుకింగ్స్ వివరాలను చూస్తే.. నార్త్ అమెరికా ప్రివ్యూస్ ద్వారా దాదాపు $550K (డాలర్లు) పైగా రాగా, నవంబర్ 5న ఇండియాలో మొదటి రోజు కోసమే ఏకంగా $1.20M పైగా వసూలైంది. మిగతా ఓవర్సీస్ ప్రాంతాల నుంచి లభించిన $400Kతో కలిపి, ప్రివ్యూలు కాకుండా కేవలం మొదటి రోజు అడ్వాన్స్ సేల్సే $1.60M దాటాయి. మొత్తం మీద ప్రివ్యూస్, ఓపెనింగ్ డే కలిపి ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ $2.15M (రూ. 20.50 కోట్లు) మార్కును దాటేశాయి.
Also Read
- Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
- AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాలు.. పిడుగురాళ్ల, దర్శి పట్టణాల్లో కూటమి హవా!
- ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
- Ramayana Song: "కాపీ కొట్టేశాడా..?".. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
విడుదలకు ఇంకా సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో థియేటర్ల సంఖ్య, షోల కేటాయింపులు పెరిగే కొద్దీ ఈ ముందస్తు వసూళ్ల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న రూ. 20 కోట్ల ప్రీ-సేల్స్ అనేది ప్రివ్యూలు, మొదటి రోజు రెండూ కలిపి వచ్చినందున.. దీనిని కేవలం నవంబర్ 5 నాటి మొదటి రోజు వసూళ్లుగా మాత్రమే చూడలేం. ప్రైమ్ ఫార్మాట్ షోలకు లభిస్తున్న ఆదరణ, రాబోయే రోజుల్లో ప్రేక్షకుల్లో పెరిగే బజ్, ఇతర థియేటర్ల లభ్యత ఆధారంగానే మొదటి రోజు అసలు కలెక్షన్ల రికార్డులు ఆధారపడి ఉంటాయి.
తాజావార్తలు
-
Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
-
Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్!
-
Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాలు.. పిడుగురాళ్ల, దర్శి పట్టణాల్లో కూటమి హవా!
ట్రెండింగ్
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..