Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్ పై కేసు నమోదు..
- అంబర్పేట్ గోల్నాకలోని డీ మార్ట్‌లో ఘరానా మోసం 100 గ్రాముల ప్యాకెట్లపై 500 గ్రాముల స్టిక్కర్ పెట్టి విక్రాయాలు కస్టమర్లు ప్రశ్నిస్తే డీ మార్ట్ ఇన్ఛార్జ్ నిర్లక్ష సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dmart Fraud: దేశంలోనే ప్రసిద్ది చెందిన సూపర్ మార్కెట్లలోనే ఒకటైన డీ మార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వేల కొద్దీ వస్తువులు, లెక్కలేనన్ని ఆఫర్లుతో ఎప్పుడూ కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రముఖ స్టోర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వినియోగదారుడికి విక్రయించిన సరుకుల తూకంలో అవకతవకలు జరిగాయని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో గోల్నాక డీ-మార్ట్‌పై కేసు నమోదు చేశారు.
Read also: Camera Found in MRI Centre: ఎంఆర్ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
అంబర్పేట్ గోల్నాకలోని అన్నపూర్ణ నగర్‌కు చెందిన సాయి డీ-మార్ట్ నుండి రూ.8500 సురుకులు కొన్నాడు. ఇంటికి వెళ్లి ప్యాకింగ్ సర్దుకొనే క్రమంలో ఎండు మిర్చి ప్యాకెట్ చెక్ చేశాడు. ప్యాకెట్‌పై 500 గ్రాములు ధర రూ. 299 కానీ.. ప్యాకెట్లో 100 గ్రాముల ఎండు మిరపకాయలు మాత్రమే ఉంది. సాయి వెంటనే డీ-మార్ట్‌కు వచ్చి అక్కడి ఇన్ఛార్జ్కి సమాచారం అందించాడు. ఇన్ఛార్జ్ సరైన సమాధానం ఇవ్వకపోగా..ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో సాయి స్థానిక నాయకులకు అక్కడకు పిలిచి జరిగిన విషయం చెప్పడంతో స్థానిక నాయకులు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
Read also: Shutdown Threat: అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన.. ట్రంప్ ముందు షట్‌డౌన్ ముప్పు..!
దీంతో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్సై శ్రీరాం సంజీవరావు, శివ తమ సిబ్బందితో వచ్చి తక్కువ బరువున్న ఎండు మిర్చి ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర వస్తువుల తూకాలను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని బాదం ప్యాకెట్లలో రంధ్రాలు ఉండడం గమనించారు. వినియోగదారులను మోసం చేయడంతో పాటు, ప్యాకెట్‌పై అధిక బరువును ముద్రించి, తక్కువ వస్తువును లోపల పెట్టి ఎక్కువ ధర వసూలు చేసినందుకు సెక్షన్ 36(2) కింద కేసు నమోదు చేశారు. అలాగే పంచనామా చేసి సంబంధిత తక్కువ బరువున్న వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2027వరకు తటస్థ వేదికలే!
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!