NTV Telugu Site icon

Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్‌ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్‌ పై కేసు నమోదు..

D Mart Froud

D Mart Froud

Dmart Fraud: దేశంలోనే ప్రసిద్ది చెందిన సూపర్‌ మార్కెట్లలోనే ఒకటైన డీ మార్ట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వేల కొద్దీ వస్తువులు, లెక్కలేనన్ని ఆఫర్లుతో ఎప్పుడూ కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రముఖ స్టోర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వినియోగదారుడికి విక్రయించిన సరుకుల తూకంలో అవకతవకలు జరిగాయని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో గోల్నాక డీ-మార్ట్‌పై కేసు నమోదు చేశారు.

Read also: Camera Found in MRI Centre: ఎంఆర్‌ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా

అంబర్‌పేట్‌ గోల్నాకలోని అన్నపూర్ణ నగర్‌కు చెందిన సాయి డీ-మార్ట్ నుండి రూ.8500 సురుకులు కొన్నాడు. ఇంటికి వెళ్లి ప్యాకింగ్ సర్దుకొనే క్రమంలో ఎండు మిర్చి ప్యాకెట్ చెక్ చేశాడు. ప్యాకెట్‌పై 500 గ్రాములు ధర రూ. 299 కానీ.. ప్యాకెట్‌లో 100 గ్రాముల ఎండు మిరపకాయలు మాత్రమే ఉంది. సాయి వెంటనే డీ-మార్ట్‌కు వచ్చి అక్కడి ఇన్‌ఛార్జ్‌కి సమాచారం అందించాడు. ఇన్‌ఛార్జ్‌ సరైన సమాధానం ఇవ్వకపోగా..ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో సాయి స్థానిక నాయకులకు అక్కడకు పిలిచి జరిగిన విషయం చెప్పడంతో స్థానిక నాయకులు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

Read also: Shutdown Threat: అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన.. ట్రంప్ ముందు షట్‌డౌన్‌ ముప్పు..!

దీంతో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్సై శ్రీరాం సంజీవరావు, శివ తమ సిబ్బందితో వచ్చి తక్కువ బరువున్న ఎండు మిర్చి ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర వస్తువుల తూకాలను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని బాదం ప్యాకెట్లలో రంధ్రాలు ఉండడం గమనించారు. వినియోగదారులను మోసం చేయడంతో పాటు, ప్యాకెట్‌పై అధిక బరువును ముద్రించి, తక్కువ వస్తువును లోపల పెట్టి ఎక్కువ ధర వసూలు చేసినందుకు సెక్షన్ 36(2) కింద కేసు నమోదు చేశారు. అలాగే పంచనామా చేసి సంబంధిత తక్కువ బరువున్న వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.
Champions Trophy 2025: హైబ్రిడ్‌ మోడల్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ.. 2027వరకు తటస్థ వేదికలే!

Show comments