NTV Telugu Site icon

Ganesh Immersion 2024: హుస్సేన్‌ సాగర్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్‌.. కనిపించని పోలీసులు..!

Hyd

Hyd

Ganesh Immersion 2024: హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గణేష్‌ నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్‌ బండ్‌ పైకి తరలి వస్తున్నాయి. దీంతో ఈరోజు (సోమవారం) ఉదయం హుస్సేన్‌ సాగర్‌ చుట్టు పక్కల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రేపు(మంగళవారం) ఖైరతాబాద్ ‘మహా’గణపతి నిమజ్జనం ఉండనుంది. దీంతో నిన్న (ఆదివారం) నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకుంటున్నాయి. అయితే, విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు పోలీసులు ఎవరూ లేరు. ట్యాంక్ బండ్ పైకి వచ్చిన వాహనాల్లో చాలా వరకు భారీ వాహనాలు ఉండడంతో.. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దారి పొడవునా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రతాపరంగా కొంత మంది పోలీస్‌ సిబ్బంది ఉన్నప్పటికీ.. హుస్సేన్ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులెవరూ కనిపించకపోవడం గమనార్హం.

Read Also: Astrology: సెప్టెంబర్‌ 16, సోమవారం దినఫలాలు

అయితే, రేపు ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగబోతుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. గణేశ్ శోభాయాత్ర భద్రత కోసం 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది. ఇక, ఖైరతాబాద్‌ గణేషుడికి ఇవాళ( సోమవారం) పూజలు నిర్వహించి.. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర స్టార్ట్ చేయనున్నారు మధ్యాహ్నాం ఒటి గంటలోపు నిమజ్జనం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం వరకు నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.