Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్‌అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు. వారి నుంచి తప్పించబోయన ఆటో ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న రిజ్వానా.. సంఘటన స్థలంలోనే చనిపోయిగా.. మృతురాలి కూతురు, కొడుకు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు.
Read Also: Star Family : కోలీవుడ్ ప్రాజెక్టుల్లో తండ్రి కూతుర్లు.. హిట్స్ దక్కేనా.?
ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో మృతురాలు రిజ్వానా కొడుకు మాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. నలుగురు యువకులు బాగా తాగి ఉన్నారు.. ఆటో డ్రైవర్ చూసి వెళ్ళమని వాళ్లతో అన్నాడు.. తమను తిట్టాడని భావించిన ఆ నలుగురు మా ఆటోను వెంబడించారు.. ఆటోని రెండు వైపులా పట్టుకొని ఊపడం మొదలుపెట్టారు.. ఆ సమయంలో ఆటో టర్నింగ్ తీసుకుంటుండగా పోల్ ని ఢీ కొట్టింది.. నేను మా చెల్లెలు ప్రమాదం నుంచి బయటపడ్డాం.. కానీ, మా అమ్మ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో ఆసుపత్రికి తరలించే లోపు చనిపోయింది అన్నాడు. కాగా, ఆటో డ్రైవర్ కి లైసెన్స్ లేదనే విషయం మాకు తర్వాత తెలిసింది.. ఆటో డ్రైవర్ ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.. మా ఆటోను వెంబడించిన నలుగురు యువకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని మృతురాలి కొడుకు డిమాండ్ చేశాడు.
