Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు నిందితులు హైదారాబాద్ కి చెందిన వాళ్ళే అని తేలింది. వందలాది ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లను టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతోనే ఇప్పటికే కొందరు యువతీ యువకులు పాస్ పోర్ట్ లు తీసుకున్నారు.
Read Also: Priyank Kharge: ‘‘ఖర్గే ఫ్యామిలీపై రజాకార్ దాడి’’.. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
కాగా, గెజిటెడ్ ఆఫీసర్స్ పేర్లతో నకిలీ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులు ఎలగం రాజ్ కుమార్, మహబూబ్, రాచమల్ల విజయ లక్ష్మీ, కూరపాటి పల్లవి, బండి శంఖర్, గిరిరాజ్ అనిల్ కుమార్ అనే నిందితులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎంత మంది ఈ కేసులో ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.