V. Srinivas Goud: రజతోత్సవ సభతో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ తమకు అండగా ఉన్నారు అనే ధైర్యం మళ్ళీ ప్రజల్లో కలుగుతోంది.. కేసీఆర్ ప్రసంగం వినేందుకు లక్షలాదిగా రేపు వరంగల్ సభకు తరలి రానున్నారు.. ఇప్పటికే రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. కార్యకర్తలు, యువకులు రేపు సభ సజావుగా జరిగేందుకు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇక, రేపు తెలంగాణ భవన్ లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేటీఆర్ గులాబీ జెండా ఎగుర వేస్తారు అని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Read Also: Nagachithanya : నాగచైతన్య కోసం పెద్ద సెట్స్.. కార్తీక్ దండు ఏం చేయబోతున్నాడు..?
ఇక, ఆ తర్వాత జలదృశ్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పాంజలి ఘటిస్తారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ చెప్పే మాటలను సభకు వచ్చే వారు ఊరూరా తిరిగి ప్రచారం చేయాలి అని కోరారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
