TG DSC Exams: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి..
- నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు..
- ఉదయం-మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు..
- రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG DSC Exams: ఎట్టకేలకు డీఎస్సీ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. డీఎస్సీ పరీక్ష రాసేందుకు శుభ సమయం రానేవచ్చింది. ఈరోజు నుంచి డీఎస్సీ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేసిన ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీని ప్రకటించి నేటి నుంచి పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాత్రం అరగంట ఎక్కువసేపు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
Read also: CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం.. నేడు శాంతిభద్రతలపై
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
అభ్యర్థులు పరీక్షకు పది నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యక్తిగత వస్తువులను అనుమతించబోమని తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ మరియు వ్యక్తిగత గుర్తింపు కార్డును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడతారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి హాజరుకాకూడదని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
Read also: Astrology: జులై 18, గురువారం దినఫలాలు
ఏడాది క్రితం సెప్టెంబరులో గత ప్రభుత్వం ఐదు వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ వివిధ కారణాల వల్ల పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదించిన 5,976 పోస్టులకు కలిపి మొత్తం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 PET, 6,508 SGT, 220 మరియు 796 SGT పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక కేటగిరీలో ఉన్నాయి.డీఎస్సీ రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 79 వేల 956 మంది దరఖాస్తు చేసుకోగా నిన్న సాయంత్రం వరకు దాదాపు రెండున్నర లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు రాయాల్సిన వారు ఒకే కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించినట్లు విద్యాశాఖ తెలిపింది.
Release clash : దీపావళి రేస్ మొదలు పెట్టిన హీరో..ఆ హీరో ఎవరంటే..?
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!