CM Revanth Reddy: బీజేపీ దక్షిణాదిపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది..

  • దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది..
  • డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం జరుగుతోంది..
  • స్టాలిన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం..
  • 22న స్టాలిన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటాం: సీఎం రేవంత్‌రెడ్డి
Dmk

Dmk

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు సమావేశం అయ్యారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి నేతలు చర్చించనున్నారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ పగబట్టింది అని విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది.. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. ఈ నెల 22వ తేదీన స్టాలిన్‌ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటాం అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.