Site icon NTV Telugu

Bhatti Vikramarka: గ్రూప్-2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తాం.. అభ్యర్థులతో డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka Mission

Bhatti Vikramarka Mission

సచివాలయంలో గ్రూప్ -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..

రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవన్నారు. సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే తమ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది.. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుంది.. కానీ తాము అలా ఆలోచించడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ బిడ్డలు స్థిరపడాలి.. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

CrowdStrike CEO: మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్యపై క్రౌడ్‌స్ట్రైక్ సీఈవో కీలక వ్యాఖ్యలు..
కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ లో పాఠాలు బోధిస్తారు.. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చు… అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్ నగర్లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెప్పారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తాం, మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేధస్సు నిలువు ఉపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన అని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది.. పరిష్కరిస్తుందని తెలిపారు.

Exit mobile version