Site icon NTV Telugu

Deputy CM Bhatti: బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడుతాం..

Bhatti

Bhatti

Deputy CM Bhatti: కాసేపట్లో సుప్రీంకోర్టులో తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేసు విచారణ జరగనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణ చేయనుంది. ఈ కేసులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ విచారణ చేయనుంది. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

Read Also: Manipur: మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. బీజేపీ నేతలు సమాలోచనలు

అయితే, బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందన్నారు. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చు.. సిపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.. ఈ రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది అని చెప్పుకొచ్చారు.

Exit mobile version