CPI Party: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి చర్చ కొనసాగింది. ఇక, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. ఆ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది తప్పితే.. ఆయా పార్టీలు అలాగే కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రతిబింబించవు అని అన్నారు. అలాగే, కాంగ్రెస్- సీపీఐ పార్టీల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారంగా తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు దొమ్మాట సాంబయ్యకు ఇవ్వాలని కోరాం.. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీతో మాట్లాడి నిర్ణయం చెబుతాను అన్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు వెల్లడించారు.
Read Also: Earthquake: మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు.. తీవ్రత 5.8గా నమోదు
అయితే, సోమవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన సీపీఐ ఎమ్మెల్యే పొత్తు ధర్మంలో భాగంగా తమకు రెండు ఎమ్మెల్సీ పదవులను కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉందని, అందులో ఒకటి ఎమ్మెల్యే కోటాలో ఇవ్వాలని కోరారు. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రెండింటిలో ఒకటి సీపీఐకి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ఇవ్వలేకపోయారు.. ఇప్పుడైనా ఎమ్మెల్యే కోటాలో ఒకటి, ఆ తర్వాత మరొక ఎమ్మెల్సీ తమకు ఇవ్వాల్సిందే అని పీసీసీ చీఫ్‌ను కూనమనేని కోరారు.