Bandi Snajay: ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అన్నారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందన్నారు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకో న్యాయం…. ఇతరులకు ఒక న్యాయమా? అని మండిపడ్డారు.
Read also: Ram Charan Selfie Video: సెల్ఫీ వీడియోతో థ్యాంక్యూ అమెరికా.. అంటున్న గ్లోబల్ స్టార్
ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ‘‘సంధ్య’’ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని గుర్తు చేశారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతోపాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు.
Read also: Bandi Sanjay: 50 ఏళ్లుగా హీరోలు వస్తున్నారు.. సెక్యురిటీ కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం..
సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటన్నారు. సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే. పైగా పాన్ ఇండియా సినిమా బెన్ ఫిట్ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కూడా సాధారణమే. ఈ విషయం తెలిసి కూడా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలై, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ తప్పును ఇతరులపై నెట్టడటం సిగ్గు చేటని తెలిపారు.
Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు!