Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సభ పేరును ‘‘సామాజిక అన్యాయ సమర భేరీ’’గా మార్చుకోండి అని సూచించారు. ఏం ఉద్దరించారని సభ పెడుతున్నారు? అని అడిగారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా?.. అర్ధశతాబ్ద కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని సీఎం చేశారా?.. దళిత, బడుగు, బలహీన వర్గాలకు మేలు కలిగేలా 6 గ్యారంటీలను కూడా అమలు చేయలేకపోయారే? అంటూ మండిపడ్డారు. జనాభాలో సగమున్న బీసీలకు కేబినెట్ లో ఎన్ని మంత్రి పదవులిచ్చారు? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవిస్తే బీసీల గొంతు వినిపిస్తున్నారు.. మరిందరూ బీసీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేశారు. ఏ ముఖం పెట్టుకుని సమర భేరీ నిర్వహిస్తున్నారు? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం
ఇక, ప్రజలకు ఏఐసీసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలి అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అడిగిన దానికంటే అదనంగా యూరియా ఇచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? అని మండిపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటే ఓర్వలేకే యూరియా కొరత పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అధికారులు తప్పు దోవ పట్టిస్తున్నారు అని ఆరోపించారు. అదనపు యూరియా ఇచ్చే విషయాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోంది.. ఇకనైనా వాస్తవాలు ప్రజల ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని బండి సంజయ్ తెలిపారు.
