Site icon NTV Telugu

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం… 600 ఫోన్లు ఒక్కరోజే టాప్!

Phone Tapping

Phone Tapping

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 మంది మావోయిస్టులకు సహాయం చేస్తున్నారని చెప్పి 600 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చి ట్యాపింగ్ కి పాల్పడ్డారు.. అయితే, ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తారనే విషయం మీద చర్చ జరుగుతుంది. ఈ 600 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు సమర్పించాడు.. ఆ తర్వాత ఆ ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ నేరుగా డీవోపీటీకి పంపించడం జరిగింది. మావోయిస్టులు ఎన్నికల సమయంలో చాలా యాక్టివ్ గా తయారయ్యారని, చాలామంది సానుభూతిపరులు ఉన్నారని, వారికి సహాయం చేస్తున్నారని, మావోయిస్టులకు డబ్బులు ఇస్తున్నారని, షెల్టర్ కల్పిస్తున్నారని చెప్పి ప్రభాకర్ రావు ఆ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ కు పర్మిషన్ తీసుకున్నాడు.. ఇక, రివ్యూ కమిటీ మాత్రం ఎలాంటి నెంబర్ల మీద వెరిఫికేషన్ చేసుకోకుండానే అనుమతి ఇవ్వడం జరిగింది.

Read Also: MLA Raja Singh: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై రాజాసింగ్ రియాక్షన్.. ఆ విషయంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా రావడానికి సిద్ధం!

అయితే, మావోయిస్టుల పేర్ల మీద ఏకంగా రాజకీయ నాయకులతో పాటు ప్రతిపక్ష అధికారపక్ష, వ్యాపారవేత్తలు, జర్నలిస్టు మీడియా చైర్మన్లు, జడ్జిలు, పోలీస్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్ నెంబర్లకు ప్రభాకర్ రావు దొడ్డి దారిన ట్యాపింగ్ కి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇక, ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత నవంబర్ 15వ తేదీ నుంచి 600 సెల్ ఫోన్లపై ట్యాపింగ్ చేయడం ప్రారంభించాడు. సాధారణ ఎన్నికల్లో మొత్తంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు చెందిన కీలక నేతలతో పాటు వాళ్ళ అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని తెలిపారు. 3 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించినప్పుడు ఈ విషయమే వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రభాకర్ రావు మాత్రం తాను వృత్తిలో భాగంగానే ట్యాపింగ్ చేశానని ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వెల్లడించారు. అప్పటి ప్రతిపక్ష నేతలకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే ఆ సమాచారం వెంటనే ప్రణిత్ రావుకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు.. ముందస్తుగా ప్రణీత్ రావు దగ్గర అందరి సెల్ ఫోన్ నెంబర్లు, డబ్బు ఉండేది అన్నారు.

Read Also: RK Roja: కుప్పం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు..?

ఇక, దాని ఆధారంగా ప్రతిపక్ష నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి వివరాలు వచ్చి రావడంతోనే వెంటనే భుజంగరావుకు ప్రణీత్ రావు సమాచారం ఇచ్చేవాడు. దీంతో భుజంగరావు నేరుగా స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులకు ఫోన్ చేసి ప్రతిపక్ష నేతలకు డబ్బులు పంపిస్తున్న వారి వివరాలను చెప్పేవాడు. దీంతో పాటుగా భుజంగరావు హైదరాబాద్ టాస్కూ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ కి సమాచారం ఇచ్చేవాడు. ఆ తర్వాత రాధాకిషన్ ఆ ఫోన్లను ట్రాక్ చేసి డబ్బులను స్వాధీనం చేసుకునేవాడు. అదే మాదిరిగా రాజకీయ ఎత్తుగడలు ఏదైనా వేస్తే వెంటనే ప్రణీత్ రావు, భుజంగరావును అలర్ట్ చేస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భుజంగరావు చెప్పేవాడు అని తేలింది. ముఖ్యంగా, టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి ఇతర పార్టీలో చేరిన నాయకులకు సంబంధించిన ప్రతి చిన్న వివరాలను కూడా ఈ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు.. ఇందులో రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావుతో పాటు డీఎస్, ఆయన కుమారుడు అరవింద్ సహా పలువురి ఫోన్లను ట్యాప్ చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ ఖచ్చితంగా కొన్ని స్థానాలను గెలుచుకోవాలి ఆ స్థానాలలో ప్రత్యర్థుల కదిలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.. ఏది ఏమైనప్పుడు కూడా 600 మంది రాజకీయ, వ్యాపారస్థులకు చెందిన సమాచారాన్ని ట్యాపింగ్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను తుఫాన్ సృష్టిస్తుంది.

Exit mobile version