ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు అధికారి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టత ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు వానాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులును మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇప్పటికే కర్షకుల కోసం కాంగ్రెస్ అంటూ రైతులకు న్యాయం చేయాలని వరి దీక్షలుకు చేపట్టారు. అయితే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసైని కాంగ్రెస్ నేతలు కలిశారు. ధాన్యం కొనుగోళ్లు, పంటల ప్రత్యామ్నాయం సహా రైతుల ఇబ్బందులపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి ప్రతం అందజేశారు. అయితే కాంగ్రెస్ నేతల వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
