NTV Telugu Site icon

Jagga Reddy: అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ నేతలే..!

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: మంచి పనిని చెడ్డ పనిలా చూపించడంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ బిజీ ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారు.. లగచర్లలో కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులపై దాడి చేసి కంపెనీలను రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చూస్తుంటే కుట్రలు చేస్తున్నారు.. మల్లన్న సాగర్ రైతులను కొట్టిన ఫొటోలు చూపిస్తా.. లగచర్లలో మేము రైతులను కొట్టినట్టు ఆధారాలు చూపించి డిబేట్ కి రండీ అని సవాల్ విసిరారు. మీరే దాడి చేసినట్టు అన్ని ఛానెల్స్ లో వచ్చింది.. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పాలనకు తేడా ప్రజలే గమనించాలని జగ్గారెడ్డి సూచించారు.

Read Also: TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు

ఇక, కేటీఆర్ కి ఒకడికే రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడ్తున్నారు.. గత 10 ఏండ్లు రాజభోగ్యాల ఆకలి కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులకు తీరలేదు అని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రైతులను, ప్రజలను కొట్టారు.. ఇప్పుడు మా ప్రభుత్వంలోను ప్రజలకు దెబ్బలే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజలను రెచ్చగొట్టి దాడులకు కుట్ర చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అలాగే, గతంలో యూనివర్సిటీల్లోకి వెళ్లి మరీ కొట్టించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు బెదిరించారు.. అధికారం పోయిందనే అక్కసుతో ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు ధర్నా చౌక్ లేకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ఇక, రైతులకు తమ ప్రభుత్వం రుణ మాఫీ చేసిన చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.