NTV Telugu Site icon

KTR: డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమి లేదు..

Ktr

Ktr

KTR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, కేసీఆర్ అనారోగ్య పాలవడం, కవిత జైలుకు వెళ్లడం, మా పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అయినా మాతో పాటే ఉన్న కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని విషయాల్లో విఫలమైంది.. ఈ ప్రభుత్వంలో కేవలం ఎనుముల బ్రదర్స్ కు మాత్రమే లాభం జరిగింది అని ఆరోపించారు. ఈ ప్రభఉత్వం ఒక్కటి కూడా పాజిటివ్ పని చేయలేదు అని కేటీఆర్ అన్నారు.

Read Also: Jupally Krishna Rao: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ది

ఇక, సీఎం అనే వారు రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి.. కానీ, కానీ దివాళా దిశగా తీసుకెళ్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇంగ్లీషు వచ్చిన కొత్త పీఆర్ఓలను పెట్టుకున్నాడు.. తెలంగాణ ఫాలింగ్ జరుగుతుంటే.. రైజింగ్ అని అంటున్నాడని పేర్కొన్నారు. అప్పులు అని తన అసమర్దతను చెప్పుకుంటున్నారు.. ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దు.. సంవత్సర కాలం ఆగండి అని మా కేసీఆర్ చెప్పారు.. ఈ సంవత్సరంలో సాధించిన విజయాలు చెప్పట్లేదు.. హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పకుండా.. అప్పుల గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు.. నేను రేపో ఎల్లుండో రాహుల్ గాంధీకి లేఖ రాస్తాను.. అశోక్ నగర్ కు వచ్చి విద్యార్థులను మోసం చేసాడు రాహుల్.. తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు స్టార్ట్ అయ్యాయి.. ఆటో డ్రైవర్లతో పాటు ఎంతో మంది విద్యార్థులు సైసైడ్ చేసుకుంటున్నారు..అవన్నీ ప్రభుత్వ హత్యలే అని కేటీఆర్ వెల్లడించారు.

Show comments