BRS Leaders Arrested: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్ట్స్ ధరించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వాగ్వాదం చోటుచేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులో తీసుకున్నారు. టీ షర్ట్స్ ధరించి రావద్దంటూ అడ్డుకున్నారు. ఎందుకు రాకూడదంటూ బీఆర్ఎస్ నేతలు వాదించారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్కు దగ్గర నివాళులు అర్పించిన అనంతరం అక్కడ నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయలు దేరారు.
Read also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
ఆదాని, రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదని, మాకు టీ షర్ట్స్ ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారంటూ కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు చేశారు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు బీఆర్ఎస్ నేతలు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులో తీసుకున్నారు.
Super Star Of The Year : ‘సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ ఎవరికి దక్కుతుందో తెలుసా ?