NTV Telugu Site icon

Hyderabad Marathon 2024: ప్రారంభమైన మారథాన్.. పాల్గొననున్న సీఎం రేవంత్..!

Hyd

Hyd

Hyderabad Marathon 2024: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది. ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆరంభించారు. మారథాన్‌లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్‌నెస్ అవేర్‌నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ గా ఇది నిలుస్తుందన్నారు. 60, 70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటుందని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని రన్నర్స్ సొసైట్ సూచించింది. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రన్నర్స్ కూడా పాల్గొన్నారు.

Read Also: Kolkata Rape Case: సంజయ్ రాయ్ బైక్ పై కోల్‌కతా పోలీస్.. దీనిపై సీబీఐ విచారణ

కాగా, ఈ మారథాన్‌‌ను హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి సరికొత్తగా ఎన్ఎండీసీ మారథాన్‌ను స్టార్ట్ చేసింది. గత మంగళవారం ఈ మారథాన్‌కు సంబంధించిన ప్రణాళికను రిలీజ్ చేయగా.. ఈ కార్యక్రమంలో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డెరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్‌లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మారథాన్‌కు సంబంధించిన టీషర్ట్, మెడల్స్ సైతం రిలీజ్ చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఈ మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందించనున్నారు.