NTV Telugu Site icon

CM Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

Revanth

Revanth

CM Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎంకు వివరించిన అధికారులు. పలు మార్పులు, చేర్పులను రేవంత్ రెడ్డి సూచించారు.

Read Also: CM Chandrababu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ప్రతి ఒక్కరూ ఊరెల్లి నలుగురితో కలవాలి..

ఇక, రాబోయే 50 ఏళ్ల కాలానికి గాను అవసరాలను అంచనా వేసి కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆసుపత్రికి నలువైపులా రహదారులు ఉండేలని చూడాలన్నారు. చికిత్స కోసం అన్ని జిల్లాల నుంచి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్లను డెవలప్ చేయాలని సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలను రూపొందించాలన్నారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎక్సైజ్ శాఖ, సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖల పని తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

Show comments