CM Revanth Reddy: గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు. పని చేసిన వారి జాబితాను కొత్త ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు.. కొందరికి పదవులు రాలేదు.. మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్లు రెండేళ్లు అవకాశం ఇచ్చాం.. పని తీరు సరిగ్గా లేని వారిని కొనసాగించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం అనను.. రెన్యువల్ కోసం వస్తారు కదా అప్పుడు చెప్తానని తెలిపారు. పదవి వచ్చింది కదా అని కూర్చున్న వాళ్లకు కొనసాగింపు ఉండదు అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
Read Also: Officer on Duty Trailer: మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ విడుదల..
ఇక, మార్చి 10వ తేదీ లోపు ఇంఛార్జ్ మంత్రులు జిల్లాకు వెళ్ళండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటి డైరెక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.. వాటికి సంబంధించిన జాబితా సిద్ధం చేయండి.. అందరికీ పదవులు ఇచ్చేద్దాం.. అలాగే, పదవులు వచ్చిన వాళ్ళు.. పదవి వచ్చింది నేను ఎందుకు పని చేయడం అనుకుంటున్నారు.. పదవి రాని వారు, పదవి రాలేదు కదా నేననేందుకు పని చేయడం అని అనుకుంటున్నారు.. మంచిని మైక్ లో చెప్పండి.. ఇక, పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి.. ఏదైనా సమస్య అంటే చెవిలో చెప్పండి అన్నారు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ కాదు.. ఆయన ప్రమోట్ చేసుకున్నారు.. టాక్స్ కలెక్షన్ లో తెలంగాణ నే టాప్.. ఆరో ప్లేస్ లో గుజరాత్ ఉంది.. విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ.. వరి ధాన్యం పండించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.. కాళేశ్వరం లేకుండానే కోటి 56 లక్షల టన్నులు పండించామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.