CM Revanth Reddy: బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకులాల విద్యార్థులకు బహుమతులను ప్రధానం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం అంటే గాలి నుంచి ఉడి పడలేదు అన్నారు. మీ మద్యలో ఉంట .. మీతోనే ఉంటానని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆశీర్వదించారు.. అట్లా అయిన నేను ముఖ్యమంత్రి.. ఇక, మొదటి 25 ఏళ్ల కష్టపడితే.. మరో 75 ఏళ్లు సంతోషంగా ఉండొచ్చు అన్నారు. అట్రాక్షన్ లో పడి లైఫ్ డివిఎట్ కాకండి అని సూచించారు. అలాగే, మీ తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి తేకండి.. నేను చదివింది అంతా ప్రభుత్వ స్కూల్ లోనే.. ప్రైవేట్ స్కూల్ లో ఎక్కువ మంది చదువుతున్నారు.. మనం విశ్లేషణ చేసుకోవాలి.. ఖాసిం మా ఊరు అతను.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అయ్యాడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Rishabh Pant: పుండు మీద కారం చల్లడం అంటే ఇదే కాబోలు.. రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.!
అయితే, కేసీఆర్ దళితులను అవమానించారు.. కానీ, ఇప్పుడు మా గడ్డం ప్రసాద్ కుమార్ నీ మైక్ అడిగి మాట్లాడేలా చేసింది మేము అని సీఎం రేవంత్ చెప్పారు. అక్కడ తప్పించుకున్నా.. ఇక్కడ తప్పించుకోలేక పోయాడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మక కలిగించాలని సూచించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉంది.. అందరూ జీవితంలో రాణించేలా చదువుకోండి.. పిలిస్తే పలికేలా నేను ఉంటా.. పని చేస్తా.. యంగ్ ఇండియా నా బ్రాండ్.. నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే అని పేర్కొన్నారు. అలాగే, ప్రజా ప్రభుత్వంలో దళిత బిడ్డలకు పట్టంకట్టాం.. కులం వల్ల ఎవరికీ సమాజంలో గుర్తింపు రాలేని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
