CM Revanth Reddy: ప్రజాభవన్ లో 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..
- దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్..
- మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నాం..
- దేశంలోనే తెలంగాణ వేగంగా
- ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రజాభవన్ లో 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అన్నారు. మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు. మన దేశాభివృద్ధి లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ… ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాల తో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం భారీ గా అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని తెలిపారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
Read also: Big Breaking: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి అనుమతిలేదు.. ట్యాంక్‌బండ్‌పై ఫ్లెక్సీలు..
Also Read
ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు మాకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా మాకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామన్నారు. ఈ డిమాండ్ ను మీరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు మేం సంపూర్ణంగా సహకారిస్తాం. తెలంగాణను మేం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించండి. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నామన్నారు.
Hyderabad Crime: రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా కాల్పుల కలకలం..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!