NTV Telugu Site icon

CM Revanth Reddy: అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా.. ఇప్పుడు సీఎం హోదాలో..

Cm Revathreddy Khairathabad

Cm Revathreddy Khairathabad

CM Revanth Reddy: గత ఏడాది కూడా పీసీసీ అధ్యక్షుడుగా వచ్చానని.. ఈ ఏడాది ముఖ్యమంత్రి హోదా లో రావడం తొలిసారి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక
భవిష్యత్ లో కూడా మీ ఆహ్వానం మేరకు రావడానికి సంతోషిస్తున్నా అని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్‌కి పూర్ణకుంభం, మంగళ హారతులతో అర్చకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా గణపతి కి గజమాల అందజేశారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Read also: CM Revanth Reddy: ఖైరతాబాద్‌ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..

గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపారు. నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నీ కూడా ఆహ్వానించామని, నగరంలో లక్ష కు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అన్ని మండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించేందుకు కృషి చేశారన్నారు. పి.జనార్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతో ఘనంగా నిర్వహించేవారన్నారు. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతోందని అన్నారు. గత ఏడాది కూడా పీసీసీ అధ్యక్షుడుగా వచ్చాను…ఈ ఏడాది ముఖ్యమంత్రి హోదా లో రావడం తొలిసారి..భవిష్యత్ లో కూడా మీ ఆహ్వానం మేరకు రావడానికి సంతోషిస్తున్నానని అన్నారు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..