Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..
- ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకతలు ఏడు ముఖాలు- ఏడు సర్పాలు- 24 చేతులు..
- బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపయ్యకు పూజలు ప్రారంభమయ్యాయి. అయితే..ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది బడా గణేష్ 70 అడుగుల ఎత్తులో కొలువుదీరారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేశుడి విగ్రహం తయారీ పనులు ఆలస్యంగా ప్రారంభమైనా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈసారి భక్తులకు శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు.
Read also: Terrible incident: పందులు దొంగతనం చేస్తుండగా చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన వ్యక్తి..
Also Read
విగ్రహంలో మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా.. బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.
Ganesh Chaturthi: ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా 75 అడుగుల బెల్లం వినాయకుడు
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!