NTV Telugu Site icon

Asaduddin Owaisi: దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. కేంద్రానికి ఓవైసీ సవాల్..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఫైర్ అయ్యారు. దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 2020లో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, రోహింగ్యా, పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తాన్ ఓటర్ల సహాయంతో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని పాలక భారత రాష్ట్ర సమితి (BRS), ఎంఐఎం చీఫ్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రోహింగ్యా ఓటర్లు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్ సిటీలో సర్జికట్ స్ట్రైక్ చేస్తాం అని అన్నారు.

Read Also: Meenakshi Lekhi: రెజ్లర్ల నిరసనపై మీడియా ప్రశ్నలు.. పరుగు పెట్టిన కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి..

మంగళవారం సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధినేత ఆ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అంటున్నారు.. దమ్ము ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండని సవాల్ విసిరారు. ఓవైసీ, కేసీఆర్ మద్య ఒప్పందం కుదిరిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ మండిపడ్డారు. కార్ స్టీరింగ్ నాచేతిలో ఉంటే అమిత్ షాకు నొప్పేంటని ప్రశ్నించారు. ఏప్రిల్ 23న, కర్ణాటకలోని చేవెళ్లలో బీజేపీ ‘సంకల్ప్ సభ’లో ప్రసంగిస్తూ.. కేసీఆర్, ఎంఐఎం పార్టీల మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. కార్ స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉందని, మజ్లిక్ కు మేం భయపడం, మజ్లిస్ కు బీఆర్ఎస్ భయపడుతుందేమో కానీ..బీజేపీ కాదని, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని కానీ.. ఓవైసీ కోసం కాదని అమిత్ షా అన్నారు.