BRS vs Sridhar Babu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లోపలికి నినాదాలు చేసుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది యూరియా కొరత తెచ్చింది అని నినాదాలు చేశారు. ప్ల కార్డులతో అసెంబ్లీ లోపలకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన మార్షల్స్ గూలాబీ పార్టీ ఎమ్మెల్యే తీసుకొచ్చిన ప్లకార్డులను తీసుకొని లోపలికి పంపించారు. ఇక, సభలోకి ప్రవేశించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పోడియం వద్దకు వెళ్లి యూరియా కోసం నిరసన వ్యక్తం చేశారు.
Read Also: MP: లేబర్‌తో భార్య ఎఫైర్.. ఉపాధ్యాయుడైన భర్తను ఏం చేసిందంటే..!
ఇక, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సమస్య ఉంటే చర్చ చేయాలి అని సూచించారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రస్తావనకు కూడా సమాధానం చెప్తామన్నారు. అసెంబ్లీ ప్రొసీజర్ ఫాలో అవ్వండి.. ప్రశ్నోత్తరాలు అవసరం లేదు అంటే చెప్పండి అని సూచించారు. ఈ సందర్భంగా మూసీ పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం అయ్యింది అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 18 నెలలో కంపెనీలు డీపీఆర్ ఇస్తాయని పేర్కొన్నారు. బాపు ఘాట్ దగ్గర భూముల బదిలీ కోసం రక్షణ శాఖకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 5 జోన్ లుగా విభజించడం జరిగింది.. మొదటి జోన్ MRDCL చేపడుతుంది.. రూ. 4100 కోట్లు రుణం కోసం ప్రయత్నిస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా రూ. 3100 కోట్లు ఇవ్వండి అని లేఖ రాశామన్నారు. అనుమతి రాగానే డీపీఆర్ ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
