Site icon NTV Telugu

MLC Kavitha: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

Kavitha

Kavitha

MLC Kavitha: ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపింది.

Read Also: Bangladesh: ‘‘వలసదారులను తోసేయడం ఆమోదయోగ్యం కాదు’’.. భారత్‌కి బంగ్లా ఆర్మీ సవాల్..

ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది అన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా.. తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది అని కల్వకుంట్ల కవిత ఎక్స్ లో రాసుకొచ్చింది.

Exit mobile version