కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 16 మంది ఆప్ అభ్యర్థుల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
ఏసీబీ కేటీఆర్ సెకండ్ నోటీసు కాపీని విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ ఏసీబీ రెండవసారి కేటీఆర్‌కు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపించింది. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్…