NTV Telugu Site icon

BRS MLAs: అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..

Brs

Brs

BRS MLAs: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిరసనగా బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీకి స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌ బ్లాక్ డ్రస్ లో వచ్చారు. సభలోకి వస్తూనే సభ్యులందరికీ నమస్కారం పెడుతున్నారు. ఈ సందర్భంగా మా ఆవేదన అర్ధం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ అని హరీశ్‌రావు అన్నారు. మరోవైపు నల్లబ్యాడ్జీలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే మంత్రి శ్రీధర్‌ బాబు స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే మీకు మాట్లాడేందుకు అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.

Read also: Jupally Krishna Rao: కాంగ్రెస్ లోనే కృష్ణ మోహన్.. కేటీఆర్ ను కలిసింది అందుకే.. జూపల్లి క్లారిటీ

కాగా, నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళల పట్ల వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా.. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిది. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్న చులకన భావాన్ని నిరూపించుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని మహిళలంతా గమనిస్తున్నారని చెప్పారు. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
Virat Kohli-Chokli: ‘చోక్లీ’ అంటూ కామెంట్‌ చేసిన శ్రీలంక ఫ్యాన్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!