Site icon NTV Telugu

Prashanth Reddy: ఎస్‌ఎల్‌బీసీని మంత్రులు వినోద యాత్రగా మార్చుకున్నారు

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీశ్‌రావు మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొనేందుకు హరీశ్‌రావు దుబాయ్ వెళ్లారన్నారు. అయినా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరగకముందే హరీశ్‌రావు దుబాయ్ వెళ్లారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Sleeping : అతిగా నిద్రపోతున్నారా..?

ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మంత్రులు సందర్శనకే వస్తున్నారని.. ఇక ఎస్‌ఎల్‌బీసీ తన బ్రెయిన్ చైల్డ్‌గా చెప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుబాయ్ టూర్‌కు వెళ్లి.. ఇప్పుడు తీరిగ్గా వచ్చి ప్రమాదం జరిగిన చోట ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Zelensey: మరోసారి ట్రంప్‌తో భేటీపై జెలెన్‌స్కీ కీలక ప్రకటన

Exit mobile version