ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీశ్‌రావు మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
ఓఆర్ఆర్ టెండర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.