Site icon NTV Telugu

Padi Kaushik Reddy: నోరు అదుపులో పెట్టుకో దానం నాగేందర్.. స్పాట్ ఎక్కడో చెప్పు నేను రావటానికి రెడీ..!

Koushik Reddy

Koushik Reddy

Padi Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ బీఆర్ఎస్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయని మండిపడ్డారు. శాసన సభ రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే స్థానం నుంచి మాట్లాడారు.. నాగేందర్ నేను హైద్రాబాద్ లోనే ఉన్నా.. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఎక్కడ స్పాట్ చెప్పు నేను రావటానికి రెడీ.. దానం నాగేందర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఎవడు ఇక్కడ భయపడటం లేదు.. కేసీఆర్ పెట్టిన బిక్షతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also: Chandigarh : చండీగఢ్ కోర్టులో కాల్పులు.. అల్లుడిని చంపిన పంజాబ్ మాజీ ఏఐజీ

అలాగే, గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మర్చిపోకు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మేము మళ్లీ కొట్టే సమయం వస్తుంది.. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్‌కు టీషర్ట్‌, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు అందరికి తెలుసు అని కౌశిక్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version