Boora Narsaiah Goud: కాంగ్రెస్ సభ సామాజిక అన్యాయ సభ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. జైభీం, జైబాపు, జైసంవిధాన స్ఫూర్తినీ హత్య చేసింది కాంగ్రెస్.. గాంధీ పేరును కూడా కబ్జా చేసి నెహ్రూ వంశం డూప్లికేట్ గాంధీలు అయ్యారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను జీవితాంతం క్షోభ పెట్టింది కాంగ్రెస్.. వారి అకాల మరణానికి కారణం కాంగ్రెస్, రాజకీయంగా ఆయన్ను హత్య చేసింది అన్నారు. అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్.. సంవిధాన్ పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రవేశికను మార్చిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. ఇప్పుడున్నది ఇందిరా గాంధీది కాంగ్రెస్.. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్.. సిగ్గు శరం లేకుండా పుస్తకాన్ని పట్టుకుని ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నది అని బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.
Read Also: IBPS PO Notification 2025: త్వరపడండి.. పరీక్ష ఒక్కటే.. 11 బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలు..!
ఇక, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాజ్యాంగ స్ఫూర్తినీ బొంద పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య తెలిపారు. నెహ్రూ మునిమనవడు గాంధీ ఎలా అవుతాడు.. ఈ సంకరజాతి ఎలా పుట్టుకువచ్చిందోనని ఆరోపించారు. రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద భారత దేశాన్ని కించపరచడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఆయన ప్రజా స్వామ్య ద్రోహి.. వ్యవస్థల మీద నమ్మకం లేక పోతే లోక్ సభలో కూర్చునే అర్హత నీకు లేదు అని విమర్శించారు. ఆయన నిఖార్సయిన భారత ద్రోహి.. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది.. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. పార్టీ పదవుల్లో ఎవడికి కావాలి.. పిల్లల్ని నేను కంటా పెంచి పోషించాల్సింది పక్కింటి వాడు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ తీరు.. అలాగే, రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజుపై రేవంత్ ఎన్నో మాట్లాడారు.. ఇపుడు ఏమీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
