BJP MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం.. డబులింజన్ సర్కార్ ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు. బీజేపీ చేసేదే చెప్తుంది, చెప్పింది చేస్తుందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా ప్రణాళికబద్దంగా ముందుకు పోతామన్నారు. రేవంత్ రెడ్డికి ఇంటి పోరు,హైకమాండ్ పోరు, ప్రజల హోరు తగలిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పాలన పడకేసి, పట్టు సాధించుకోలేక ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.. ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో రేవంత్ రెడ్డి త్వరలోనే సెంచరీ కొట్టడం ఖాయం అని ఎద్దేవా చేశారు. కనీసం మంత్రి వర్గ విస్తరణ లేదు, ఎమ్మెల్సీల ఫైనల్ లేదు.. మిణుకు మిణుకు మంటూ కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేశాయని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో విద్యావంతులు, మేధావులు, టీచర్లు మార్పు కోరుకుంటారన్నది స్పష్టం అవుతోంది.. రాహుల్ గాంధీ అబద్దాల ప్రచారం ప్రజలు నమ్మడం లేదు.. సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉంది అని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రేవంత్ రెడ్డి సాధారణ ఎన్నికలుగా మార్చారు.. ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తుంటే రేవంత్ ఎదురు దాడి చేస్తున్నారు.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. రాష్ట్రంలో మేం అధికారంలో లేము.. అయినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వెల్లడించారు.